Sunday, January 18, 2009

గెలుపు మాదే....

న్యూఢిల్లీ, జనవరి 17(మేజర్‌ న్యూస్‌) : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చిందుకే ఢిల్లీ వచ్చినట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చెప్పారు. తెలంగాణపై కాంగ్రెెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి వెఎస్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై మొయిలీ ఏమన్నారో తనకు ఖచ్చితంగా తెలియదన్నారు. ఈ అంశంపై రాజధానిలో దుమారం రేగినప్పటికీ ఆయన తొణికినట్టు కనిపించలేదు. మొయిలీ వ్యాఖ్యలతో కా్రంగెస్‌ సీనియర్లు తీవ్ర ఆందోళనతో ఉన్న విషయాన్ని వైఎస్‌ తేలికగా కొట్టిపారేశారు. తెలంగాణా అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా ముందుకు పోతారా అన్న ప్రశ్నకు డోంట్‌ వర్రీ అని వైఎస్‌ సమాధానం చెప్పారు. మహా కూటములు, మెగా కూటములు కాంగ్రెెస్‌ను ఏమీ చేయలేవని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఒలింపిక్‌‌సలో గోల్‌‌డ మెడల్‌ తమదేనని, మిగతా పార్టీలు రజత, కాంస్యాలకు పోటీపడవలసిందేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం తాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిసి సత్యం వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించారు.

అయితే వైఎస్‌ ముందు అనుకున్నట్టుగా తెలంగాణ తదితర రాజకీయ అంశాలపై చర్చించేందుకే ఢిల్లీకి రాలేదని తెలుస్తోంది. ఏఐసిసిలో ఆదివారం కోర్‌ కమిటి సమావేశం ఉందని, అందులో పాల్గొనడానికే ఆయన ఇక్కడికి వచ్చారని అంటున్నా అందులో కూడా వాస్తవం లేదని తెలుస్తోంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే దేశరాజధానిలో ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమి శక్తియుకులు, సైద్ధాం తిక నిబద్దతపై అనుమానాలు వ్యక్తం కావడం. తెలంగాణా సాధించడానికి ఈ కూటమి ఏర్పడిందనే అభ్రిపాయంతో ఏకీభవించేవారు ఎక్కువగా లేరని కొందరు నేతల మాటలను బట్టి తెలుస్తోంది.

కాగా, ముఖ్యమ్రంతి వైఎస్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అ„హ్మద్‌ పటేల్‌ తదితర నాయకులను కలువనున్నారు. సోమవారం వరకు వైఎస్‌ ఇక్కడే ఉండే అవకాశమున్నందున వివిధ మంత్రిత్వశాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై పలువురు మ్రంతులను కలిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఒబామా హత్యకు కుట్రపన్నిన వ్యక్తి అరెస్టు

వాషింగ్టన్‌, జనవరి 17 : అమెరికా అధ్యక్షుడిగా మరో మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న బరాక్‌ ఒబామా హత్యకు కుట్ర పన్ని స్టీవెన్‌ జోసఫ్‌ క్రిస్టఫర్‌ అనే వ్యక్తిని మిసిసిపీలోని బ్రూక్‌హావెన్‌లో అరెస్టు చేశారు. ఒబామాను హతమారుస్తానంటూ గత కొన్ని రోజులుగా క్రిస్టఫర్‌ బెదరిస్తుండటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా అటార్నీ డన్‌ లాంప్టన్‌ చెప్పారు. విస్కాన్సిన్‌కు చెందిన క్రిస్టఫర్‌ను స్థానిక పోలీసుల సహకారంలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అరెస్టు చేశారు. ఒబామాను హతమార్చాలని తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం కాదని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇందుకు పాల్పడాలని నిర్ణయించినట్టు క్రిస్టఫర్‌ వివరించారు.

ఐరాస సారధ్యంలో ఉగ్రవాద వ్యతిరేక దళం : కలాం

న్యూఢిల్లీ, జనవరి 17 : ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో తీవ్రవాద వ్యతిరేక దళాన్ని ఏర్పాటు చేయాలని మాజీ రాష్టప్రతి అబ్దుల్‌ కలాం సూచించారు. శుక్రవారం ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జాతీయ ఉద్యమంతో పాటు సంబంధిత కేసుల పరిష్కారానికి మరింత కఠినమైన చట్టాలను రూపొందించాలని కలాం అభిప్రాయపడ్డారు. చెడు శక్తులు అన్నీ ఏకమైనప్పుడు, మంచి మనసులు కూడా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉగ్రవాదులను నిరోధించడానికి పలు దేశాలు సముద్ర, సైబర్‌ చట్టాల అమలుకు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

35 అడుగుదాం....

మహాకూట మితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందు వల్ల సీట్ల పంప కంపై ఎలాంటి పేచీ లేకుండా ఇప్పటి నుంచే నాయకుల ను సమన్వయం చేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని కొన్ని స్థానాలలో రెండుపార్టీలకు చెందిన నేతలు పోటీకి ఉత్సాహం చూపడంతో కొంతవరకుఇబ్బందికర పరిస్థితి ఎదు రయ్యే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

Saturday, January 17, 2009

కొత్తరాజకీయానికి లోకసత్తా వేదిక

కుల నిర్మూలన దిశగా చేస్తున్న కొత్త రాజకీయానికి లోక్‌సత్తా వేదికగా మారుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, ఎస్‌. మనోరమలు తెలిపారు. రిజర్వేషన్లను రాజకీయ లబ్దికోసం కాక ఒక్కతరం కాలంలో కులనిర్మూలన కోసం వినియో గిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా పోరాడుతున్న లోక్‌సత్తా పార్టీపట్ల ఆకర్షితులై బీసీ సంఘాలు, నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారని వారు చెప్పారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరనున్న బీసీ నేతల వివరాలను, వారితో కలిసి చేయ బోయే ప్రచార పంధాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని వారు తెలిపారు.

మార్చి మొదటి వారంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో?

రాష్ట్ర కాం గ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను మార్చి తొలి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యేనాటికి మేనిఫెస్టోను విడుదల చేయడమే మంచిదని కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది.

మహా కూటమి కాదది... మభ్యపెట్టే మాయా కూటమి: చిరంజీవి

టీడీపీ, టీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలతో కలసి ఏర్పడ్డ కూటమి మహా కూటమి కాదని.. అది ప్రజలను ఏ మార్చి మభ్యపెట్టే మాయా కూటమి అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభి వర్ణించారు.